Header Banner

చేనేత కార్మికులకు బంపర్ ఆఫర్! ఆ పథకం మళ్లీ అమలులోకి.. వారు మాత్రమే అర్హులు!

  Sun Mar 02, 2025 22:24        Politics

2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ.. 2024 ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే గతంలో తాము అమలు చేసిన కార్యక్రమాలను టీడీపీ ప్రభుత్వం మళ్లీ అమలు చేయాలని భావిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు, పథకాలను తిరిగి అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని చేనేత కార్మికులకు టీడీపీ కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. చేనేత కార్మికులకు ఆర్థిక దన్నుగా నిలిచే ఓ పథకాన్ని తిరిగి తీసుకువచ్చింది. చేనేత కార్మికుల కోసం గత టీడీపీ హయాంలో థ్రిఫ్ట్ ఫండ్ పథకం అమలు చేశారు. అయితే 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఈ థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని రద్దు చేసింది. అయితే నేత కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ కూటమి ఈ థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని మళ్లీ తీసుకువచ్చింది. థ్రిఫ్ట్ ఫండ్ పథకం పునరుద్ధరణతో చేనేత కార్మికులకు అధిక ప్రయోజనం కలగనుంది. థ్రిఫ్ట్ ఫండ్ పథకం పునరుద్ధరణతో పాటుగా ఈ పథకం అమలు కోసం ఏపీ ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. ఈ పథకం అమలు కోసం రూ.5 కోట్లు నిధులను కేటాయించారు. ఇందులో మెజారిటీ వాటా చేనేత కార్మికులు అధిక సంఖ్యలో ఉండే ఉమ్మడి అనంతపురం జిల్లాకు దక్కనుంది.


ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!


థ్రిఫ్ట్ ఫండ్ పథకం.. అంటే ఏమిటి?
చేనేత కార్మికులకు ఆర్థికంగా మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతో ఈ థ్రిఫ్ట్ ఫండ్ పథకం తీసుకువచ్చారు. అయితే ఈ పథకానికి చేనేత సహకార సంఘాలలో సభ్యులుగా ఉన్న చేనేత కార్మికులు మాత్రమే అర్హులు. ఈ పథకం కింద చేనేత సహకార సంఘాలలో సభ్యుడిగా ఉన్న కార్మికుడు తన నెలవారీ సంపాదనలో 8 శాతాన్ని పొదుపు చేస్తే.. ప్రభుత్వం థ్రిఫ్ట్ ఫండ్ నుంచి 16 శాతాన్ని కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి జమచేస్తుంది. మూడు నెలలకు ఒకసారి చొప్పున చేనేత కార్మికుల ఖాతాల్లోకి ప్రభుత్వం సొమ్ము జమ చేస్తుంది. ఉదాహరణకు చేనేత కార్మికుడు నెలకు రూ.1000 చొప్పున పొదుపు చేస్తే.. ప్రభుత్వం దానికి మరో రెండు వేలు జమ చేస్తుంది. ఈ లెక్కన చేనేత కార్మికులు ఏడాదికి 12 వేలు పొదుపుచేస్తే.. ప్రభుత్వం నుంచి రూ.24 వేలు జమవుతుంది. అంటే మొత్తం రూ.36 వేలు కూడా బ్యాంకు ఖాతా నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో చేనేతలకు ఆర్థికంగా మద్దతు ఇచ్చినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక కొత్తగా ఏర్పాటు చేయనున్న చేనేత సహకార సంఘాలలోని సభ్యులకు కూడా ఈ థ్రిఫ్ట్ ఫండ్ పథకంలో చేరే అవకాశం కల్పిస్తున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

 

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

 

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #weavers #goodnews #todaynews #flashnews #latestnews